'ఆపరేషన్ కాగర్'ను నిలిపి వేయాలి': ప్రజాస్వామిక వాదులు

HYD: 'ఆపరేషన్ కాగర్'ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ.. శుక్రవారం HYDలో ప్రెస్ క్లబ్‌లో ప్రజాస్వామిక వాదులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించారు. సమాజ శాంతి, భద్రతకు చర్యలు తీసుకోవాలని నేతలు అన్నారు. వెంటనే ఆపరేషన్ కాగర్‌ను నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి పెద్దఎత్తున ప్రజాస్వామిక వాదులు హాజరయ్యారు.