VIDEO: 'జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాంతం పరితపించాడు'

WNP: ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాంతం పరితపించాడని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా బుధవారం BRS ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమాన్ని ఆరిపోకుండా మూడు దశాబ్దాలపాటు స్వరాష్ట్రకాంక్షను సజీవంగా నిలిపిన నిస్వార్థపరుడు అని అన్నారు.