ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది: మాజీ ఎంపీ

ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది: మాజీ ఎంపీ

AP: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ చింతా అనురాధ ఆరోపించారు. అమలాపురంలోని సన్నవిల్లి గ్రామంలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు పక్షపాతి జగన్ తన పాలనలో రైతులకు సంపూర్ణ సహకారం అందించి వారికి అండగా నిలిచారని తెలిపారు.