అమ్మవారిపేట గుట్టల జాతరకు తరలిన సారలమ్మ

అమ్మవారిపేట గుట్టల జాతరకు తరలిన సారలమ్మ

WGL: వరంగల్ నగర్ శివారు అమ్మవారిపేట గుట్టల్లో జరిగే శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు బుధవారం సారలమ్మ ఉరుసు కరీమాబాద్‌లోని గూడూరు బిక్షపతి ఇంటి నుంచి తరలివెళ్లారు. మేళతాళాల మధ్య వడ్డెర పూజారులు వెదురు కుంకుమ భరణితో పూనకాల నడుమ సారలమ్మలను వైభవంగా తీసుకెళ్లగా, జాతర అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, భక్తులు భారీగా పాల్గొన్నారు.