పుట్టపర్తి ఆకాశంలో డ్రోన్ల కాంతి నృత్యం
సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంపై ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. దాదాపు 2,000 డ్రోన్లతో ఏర్పాటు చేసిన లైట్ అండ్ లేజర్ షో ఆకట్టుకుంది. సాయిబాబా జీవిత చరిత్రకు సంబంధించిన వివిధ ఆకృతులను డ్రోన్ కాంతులతో ఆవిష్కరించారు. ఈ దృశ్యాన్ని వేలాది మంది భక్తులు వీక్షించి ఆనందించారు.