కూటమి ప్రభుత్వ హాయంలో పారిశ్రామిక అభివృద్ధి
VSP: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుందని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని సాధిస్తామని తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో బుధవారం శాసనసభ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.