ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్
AKP: ఎస్ రాయవరం మండల పరిధిలో సోమవారం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేశారు. శత శాతం పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు. ప్రజలు కట్టే ఇంటి పన్నులను పంచాయతీల అభివృద్ధికి వినియోగిస్తామన్నారు.