గోదావరి నది మధ్యలో ఆగిన బోటు

గోదావరి నది మధ్యలో ఆగిన బోటు

కోనసీమ: గోదావరి నదిలో పెను ప్రమాదం తప్పింది. నరసాపురం వైపు నుంచి సఖినేటిపల్లి వస్తున్న బోటు సాంకేతిక సమస్య కారణంగా గోదావరి మధ్యలో అరగంట సేపు ఆగిపోయింది. ఆగిన బోటులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. బోటు ఇలా నది మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.