మాజీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

మాజీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకులుగా తనను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డిని కదిరి బాబురావు సత్కరించారు. అనంతరం పార్లమెంట్ పరిశీలకుల సమావేశంలో పాల్గొన్నారు.