VIDEO: నల్లవాగు ప్రాజెక్టు కు 2374 క్యూసెక్కులు వరద

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి బుధవారం నిండుకుండలా తలపిస్తోంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద జలాలు చేరుతుండడంతో జలకళను సంతరించుకుంది. జలాశయంలో 2374 క్యూసెక్కులు వరద జలాలు చేరుతున్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 1493 ఫీట్స్ కాగా 1493. 67ఫీట్స్ చేరుకొని అలుగు ద్వారా దిగువకు పారుతున్నాయని AE శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు.