కులగణన పారితోషికం చెల్లించాలని నిరసన
KMR: జిల్లా కేంద్రంలోని పదో తరగతి స్పాట్ మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (TTJAC, USPC, JACTO) ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. 2025 మార్చిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ మూల్యాంకనానికి సంబంధించిన సుమారు రూ.20 కోట్ల పారితోషికం ఇంకా చెల్లించలేదని, అలాగే కులగణన సర్వే నిర్వహించి 18 నెలలు గడిచినా పారితోషికం చెల్లించలేదన్నారు.