సహస్ర తల్లిదండ్రుల ఆందోళన

TG: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సహస్ర తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సహస్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన కూతురిని తామే చంపామని తమపై ఎన్నో నిందలు వేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.