జిల్లాలో ఉ. 9 గంటల వరకు నమోదైన పోలింగ్
KMR: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. 7 మండలాల్లో ఉదయం 9గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 20.96 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో అత్యధికంగా 28.53%, లింగంపేట్ మండలంలో అత్యల్ఫంగా 9.94% నమోదైందని వివరించారు.