రేపు తాండవ రిజర్వాయర్ నీరు విడుదల

రేపు తాండవ రిజర్వాయర్ నీరు విడుదల

AKP: తాండవ రిజర్వాయర్ నుంచి ఈనెల 10వ తేదీన నీటిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నీటిసంఘం ఛైర్మన్ కరక సత్యనారాయణ, ఎస్సై సీహెచ్ భీమరాజు ఇవాళ పరిశీలించారు. నాతవరం, నర్సీపట్నం, కోటురట్ల, తుని, రౌతులపూడి, కోటనందూరు మండలాల రైతులతో తాండవ డ్యామ్ వద్ద ఆదివారం సమావేశం జరగనుంది.