'తెలుగు భాష వాడుక తీరుపై తనిఖీలు చేయాలి'
AP: అధికార భాషా సంఘం చేయాల్సిన కార్యకలాపాలపై కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగు భాష వాడుక తీరుపై తనిఖీలు చేయాలని తెలిపింది. రాష్ర్ట ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో తెలుగు భాష వినియోగాన్ని పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. అధికార భాషాభివృద్ది కోసం తగిన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని పేర్కొంది.