లింగంపేటలో కవితకు బోనాలతో ఘన స్వాగతం
KMR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 'జాగృతి జనంబాట' కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిన్న పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా లింగంపేట మండల కేంద్రానికి చేరుకున్న కవితకు జాగృతి శ్రేణులు, స్థానిక ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. కవిత అందరికీ అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. అనంతరం ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.