యూరియా కొరత లేకుండా చూడాలి: MLA

ప్రకాశం: గిద్దలూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం MLA అశోక్ రెడ్డి, మండల వ్యవసాయాధికారితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి కేటాయించబడ్డ యూరియా, ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని ఆయన వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.