సాధారణ కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి

KRNL: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి దశ నుంచే సునీల్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేసి అనేక పోరాటాలను చేశారు. సునీల్ రెడ్డి నియామకం పట్ల జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.