VIDEO: "పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం"
WGL: వర్ధన్నపేట పట్టణంలో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సారంగపాణి పాల్గొన్నారు.