విద్యుత్ షాక్తో గేదె మృతి

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి శివారులో విద్యుత్ షాక్తో గేదె మంగళవారం మృతి చెందింది. నారాయణపూర్ గ్రామానికి చెందిన జెల్ల తులసి రైతుకు చెందిన బర్రె మేయడానికి నారాయణపూర్ బండలింగంపల్లి వాగు మధ్యలో గల శివారులోకి మేతకు వెళ్లింది. వ్యవసాయ పొలం దగ్గర సర్వీస్ వైరు కాళ్లకు చుట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.