'రైతులను అన్ని విధాల ఆదుకుంటాం'
ప్రకాశం: రాష్ట్ర రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలోని గుంటూరు లింగన్నపాలెం గ్రామంలో MSMపార్క్ ప్రారంభం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను దళారీలు లేకుండా నేరుగా రైతులు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.