రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

HNK: కాజీపేట మండలం పాతిమా నగర్ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు GRP హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు 50 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా గుర్తించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని కోరారు.