ఏయులో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

VSP: అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా సోమవారం AU పొలిటికల్ సైన్స్ విభాగంలో 'ప్రజాస్వామ్య విలువల భవిష్యత్తుపై' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరయ్యారు. బలమైన ప్రజాస్వామ్యం కోసం పౌరులు యువత పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు పండితులు పాల్గొన్నారు.