భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ధ్యేయం
RR: భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లోని ఆదిత్యనగర్, ఇతర కాలనీలలో నూతన భూగర్భ డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.