కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సాగరం గ్రామ యువత
JN: స్టేషన్ ఘన్‌పూర్ సాగరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి తాటికాయల అనసూర్య, ఆమె తనయుడు ముఖ్య నాయకుడు అశోక్ కాంగ్రెస్ పార్టీని వీడారు. వీరిని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి అనసూర్యమ్మ ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్‌గా గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.