వస్త్ర దుకాణంలో భారీ చోరీ
ప్రకాశం: అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు బజారులో భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆకృతి సిల్క్స్ వస్త్ర దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్‌లో ఉన్న రూ. 5 లక్షలు నగదు దోచుకు వెళ్లారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.