'రక్తదానానికి యువత ముందుకు రావాలి'
అన్నమయ్య: రక్తదానం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కడప డీసీఎం ఎస్ ఛైర్మన్ ఎర్రగుంట్ల జయప్రకాష్ పిలుపునిచ్చారు. శనివారం కోడూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ వరలక్ష్మి, టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ పటాన్ మౌలా ఉన్నారు.