సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
SDPT: చేర్యాల మున్సిపల్ కార్మికులకు మహిళ రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం ఎస్సై నవీన్ సూచించారు. మహిళా చట్టాలు, పోక్సో, నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే వెంటనే పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నంబర్ 87126 67434కు సమాచారం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ షీటీమ్ తదితరులు పాల్గొన్నారు.