కుప్పంలో పునరావాస కేంద్రం ఏర్పాటు

చిత్తూరు: కుప్పంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అధికారులకు సూచించారు. కుప్పం మున్సిపాలిటీ బాబు నగర్ వాసుల కోసం సామగుట్టపల్లి వద్దనున్న అంబేద్కర్ భవనాన్ని పునరావస కేంద్రంగా సిద్ధం చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.