'సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి'

'సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి'

SRCL: సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు రిజిస్టర్, అన్ని వార్డులు, మందుల గదిలో పరిశీలించారు. ప్రతి రోజూ ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారని ఆరా తీశారు.