VIDEO: 'రోడ్డు మరమ్మతులు చేపట్టండి'
SRD: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు గుంతల మయంగా మారాయి. మున్సిపాలిటీ పరిధిలోని వడక్పల్లి, బొమ్మన్ కుంట నుంచి కిష్టారెడ్డిపేట వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. నిత్యం ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.