BREAKING: కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు
CTR: బంగారుపాళ్యం మండలం తంబిగానిపల్లె సమీపంలో శనివారం ఓ కంటైనర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కంటైనర్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.