ఆర్మూర్ పట్టణ ప్రజలకు గమనిక

NZB: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయి ముందస్తుగా చెల్లిస్తే 5% రాయితీ పొందవచ్చని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 శాతం రాయితీని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందించాలని కోరారు.