న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ నిరసన

MNCL: హైదారాబాద్‌లోని కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాది శ్రీకాంత్‌పై దాడిని నిరసిస్తూ మంగళవారం లక్షెట్టిపేటలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీకాంత్‌కు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు అరికట్టేందుకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు.