విద్యుత్ ప్రమాదంపై మంత్రి ఆరా
AP: కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల్లో విద్యుత్ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి ఆరా తీశారు. విద్యుత్ షాక్‌తో ఒకరు మృతిచెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.