ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

NLR: ప్రభుత్వ సర్వీసులో కొత్తగా చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి, పేరు ప్రఖ్యాతలు సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్యేక నియామక కోటాలో ఉద్యోగం పొందిన ముగ్గురికి నియామక పత్రాలను ఆమె అందజేశారు. వీరిలో ఇద్దరు రెవెన్యూ డిపార్ట్‌మెంట్, మరొకరు సంక్షేమ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు.