కారంచేడులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ కాలువలు

కారంచేడులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ కాలువలు

BPT: కారంచేడు గ్రామంలోని డ్రైనేజీ కాలువల పూడికతీత పనులు స్థానికులకు శాపంగా మారాయి. పంచాయతీ సిబ్బంది కాలువల్లోని మట్టిని, వ్యర్థాలను తీసి రోడ్డుపైనే వదిలివేయడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యర్థాల వల్ల గ్రామంలో దుర్గంధం వెదజల్లుతోందని, దోమల బెడద పెరిగి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.