చలితో గజగజ వణుకుతున్న ప్రజలు
KMR: మద్నూర్, జుక్కల్, డోంగ్లీ, బిచ్కుంద తదితర మండలాల్లో ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. నిన్న అర్ద రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు చలిమంటలు, రూమ్ హీటర్లు, ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.