వేసవిలో నీటి సమస్యల నివారణకు చర్యలు
ప్రకాశం: వేసవి కాలంలో ప్రజలకు నీటి కొరత రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఆయన పర్యటించారు. అక్కడ నెలకొన్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త పైప్‌లైన్‌ను వేయించినట్లు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.