ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీసి, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు.