VIDEO: నెల్లూరులో ఆటో డ్రైవర్ల ఆందోళన
NLR: పాత పద్ధతిలోనే ఆటో డ్రైవర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని నెల్లూరులో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ATS సెంటర్‌లను వెంటనే ఎత్తివేయాలని, రవాణాశాఖ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ATS సెంటర్‌లు అవినీతి గడ్డగా మారాయని వారు మండిపడ్డారు.