పురుగుల మందు తాగి ఒకరు మృతి

ADB: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోథ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాము కథనం మేరకు కోట(కె)కు చెందిన జల్కే ఆకాష్ (21) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బోథ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.