క్రీడా పోటీలలో కానాల విద్యార్థుల ప్రతిభ
NDL: తిరుపతిలో జరిగిన 69వ SGF రాష్ట్రస్థాయి బాలికల బ్యాడ్మింటన్ పోటీలలో కానాల ZPHS విద్యార్థిని జి.షాహిర ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రం పొందారు. చీరాలలో జరిగిన రాష్ట్రస్థాయి సెపక్తక్రా జూనియర్ బాలుర విభాగంలో చాంద్ బాషా, మాబు హుస్సేన్ ప్రతిభ చూపారు. చదరంగంలో జిల్లాస్థాయిలో మదు లోకేష్ విజయం సాధించాడు. విద్యార్థులను ఇవాళ HM మురళీ కృష్ణ అభినందించారు.