ఇంటి పన్నులను పరిశీలించిన ఎంపీడీవో
NTR: నందిగామ మండలంలోని పల్లగిరిలో హౌస్ టాక్స్ వసూళ్లపై ఎంపీడీవో ప్రసాద్ రావు సోమవారం పరిశీలించారు. గ్రామంలో హౌస్ టాక్స్ వసూళ్ల పురోగతిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. గ్రామ అభివృద్ధికి పన్నుల వసూళ్లు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.