విషాదం: కంకరే.. యముడై..!
TG: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాంగ్ రూట్‌లో కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ లారీ మితిమీరిన వేగంతో దూసుకువచ్చింది. వేగం కంట్రోల్ కాకపోవడంతో.. అదుపుతప్పి బస్సుపై పడింది. ఈ క్రమంలో టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సులో పడటంతో.. ప్రయాణికులు కూరుకుపోయారు. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది.