సిరసనగండ్ల రాములోరి హుండీ ఆదాయం

NGKL: చారకొండ పరిధి సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు కానుకల రూపంలో రూ. 12,67,915 నగదు, 400 గ్రాముల వెండి హుండీలో వేశారని ఆలయ ఛైర్మన్ డేరం రామశర్మ, ఈవో స్వర్ణం ఆంజనేయులు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది రూ.4 లక్షల ఆదాయం పెరిగిందని వారు పేర్కొన్నారు.