రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

ASF: గత BRS ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు దూరం చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, దేవాజి, రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం రెబ్బెన మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.