బనకచర్లతో తాగు, సాగు నీరు: ఎమ్మెల్యే

AP: బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి సాగునీరు, తాగునీరు అందుతుందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమలకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు. కొందరు కావాలనే బనకచర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేది మంత్రి లోకేష్ ఆలోచన అని పేర్కొన్నారు.