బోధన్‌లో బీఆర్ఎస్ పార్టీకి మల్లీ కొత్త షాక్
NZB: మున్సిపల్ ఎన్నికల వేళ బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్, ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వరరావు దేశాయ్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.