కెప్టెన్‌గా హిట్.. బ్యాటర్‌గా ఫట్

కెప్టెన్‌గా హిట్.. బ్యాటర్‌గా ఫట్

T20 కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ కేవలం 12 పరుగులే చేశాడు. గత 21 T20ల్లో 13.27 సగటుతో 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అయితే, కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తుండటంతో అతడిని పక్కన పెట్టడానికి యాజమాన్యం సిద్ధంగా లేదు.